న్యూఢిల్లీ: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవపడుతుంటారు. అలాంటి ఘటనే ఒకటి ఢిల్లీ మెట్రోలో జరిగింది. టీ షర్ట్ ధరపై మొదలైన వాగ్వాదం ఇద్దరి యువతీ యువకుల మధ్య భౌతికదాడికి దారితీసింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లుకొడుతోంది.
ఈ వీడియోను మందర్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. యువతి ధరించిన టీ షర్టు ధరపై యువకుడు ప్రశ్నించాడు. ఆమె ఆ టీ షర్టును జరా నుంచి రూ.వెయ్యికి కొనుగోలు చేసినట్లు చెప్పగా, అతడు ఖండిస్తాడు. అది రూ.150 కంటే ఎక్కువగా ఉండదని యువకుడు పేర్కొనగా, యువతి కోపోద్రిక్తురాలైంది. యువకుడి చెంపె చెల్లుమనిపించింది. అలాగే, వరుసగా ఆమె చెంపదెబ్బలు కొడుతుండడంతో యువకుడుకూడా ప్రతిఘటించాడు. యువతి చెంప చెల్లుమనిపించాడు. యువతీ యువకుల ఆకస్మిక చర్యతో అవాక్కైన ప్రయాణికులు, వారు దిగిపోగానే నవ్వుకోవడం వినిపించింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
गर्लफ्रेंडने बॉयफ्रेंडला काढलं बुकलून, दिल्ली मेट्रोमधील व्हिडीओ व्हायरल pic.twitter.com/bO7BXnYFZ4
— Mandar (@mandar199325) July 13, 2022