అమృత్సర్ : శిరోమనీ అకాలీ దళ్ కొత్త అధ్యక్షుడిగా జ్ఞాని హర్‌ప్రీత్ సింగ్(Giani Harpreet Singh) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన అకాల్ తక్త్ తాత్కాలిక జతేదార్‌గా ఉన్నారు. అయిదుగురు సభ్యుల అకాల్ తక్త్ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయంగా తీసుకున్నది. బీబీ సత్వంత్ కౌర్‌ను పంతక్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా నియమించారు. శిరోమనీ అకాలీ దళ్ పార్టీలో రెబల్ వర్గానికి హర్‌ప్రీత్ సింగ్ అనుకూలంగా ఉన్నారు. తక్త్ నియమిత కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని శిరోమనీ అకాలీదళ్ నేతలు తిరస్కరించారు. సుఖ్బీర్ నేతృత్వంలోని శిరోమని పార్టీకి ధీటుగా అకాల్ తక్త్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. బుర్జ్ కాలీ బాబా పూలా సింగ్ బిల్డింగ్‌లో ఇవాళ అకాలీ నేతను ఎన్నుకున్నారు.