Viral Video | గాల్లోకి నోట్లు వెదజల్లుతూ.. బాణసంచా కాలుస్తూ రచ్చ.. ముగ్గురు అరెస్ట్
Viral Video | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ (Ghaziabad)లో కొందరు రెచ్చిపోయారు. పుట్టినరోజు వేడుకల (birthday celebration) సందర్భంగా గాల్లోకి కరెన్సీ (currency) నోట్లు విసురుతూ.. బాణా సంచా కాలుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు.
Viral Video | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ (Ghaziabad)లో కొందరు రెచ్చిపోయారు. పుట్టినరోజు వేడుకల (birthday celebration) సందర్భంగా గాల్లోకి కరెన్సీ (currency) నోట్లు విసురుతూ.. బాణా సంచా కాలుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వీడియో ఆధారంగా ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.
రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోపల ముగ్గురు వ్యక్తులు కారుపైకప్పుపై నిలబడి బాణసంచా కాలుస్తూ.. డబ్బులు వెదజల్లారు. అపార్ట్మెంట్ యజమానుల సంఘం వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా సదరు యువకులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
నంద్‌గ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ సింగ్ మాట్లాడుతూ.. యువకులు అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారని, ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారన్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
@ghaziabadpolice @DCPCityGZB #Ghaziabad pic.twitter.com/Q97dZabFch
— Ajnara Integrity AOA (@integrityaoa) October 29, 2023
थाना नन्दग्राम से सम्बन्धित एक वीडियो जिसमें कुछ लोग बर्थडे मनाते हुए रील बनाये है जिसमें उन्होने आपत्तिजनक शब्दाबली का प्रयोग किया है एवं हुड़दंग करते हुए दिख रहे है, का संज्ञान लेते हुए अभियोग पंजीकृत कर तीन लोगो को गिरफ्तार किया गया है। विधिक कार्यवाही प्रचलित है~ACP नन्दग्राम pic.twitter.com/2RQkzyO9Bs
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) October 29, 2023
Also Read..
Kerala blasts | కేరళ వరుసపేలుళ్ల ఘటనలో 12 ఏళ్ల బాలిక మృతి.. 3కి చేరిన మరణాల సంఖ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

