న్యూఢిల్లీ : జాతీయ రహదారులపై భద్రతను పెంచి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) త్వరలో టెలికం ఆధారిత సేఫ్టీ అలర్ట్ సిస్టమ్‌ను అమలు చేయనుంది.
ఎస్ఎంఎస్లు, వాట్సాప్, అత్యధిక ప్రాధాన్యం కలిగిన కాల్స్ ద్వారా నేషనల్ హైవే ప్రయాణికులను ఈ విధానంలో ప్రమాదాల గురించి ముందుగానే అప్రమత్తం చేస్తారు.