న్యూఢిల్లీ: నైపుణ్య భారత శ్రామిక శక్తి పట్ల నమ్మకంతో వారికి జారీ చేసే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విదేశీ పెట్టుబడిదారులకు భారత్ తప్ప మరొక ఉత్తమమైన దేశం లేదని.. భారత్ వృద్ధి పథంలో భాగం కావడానికి ఇది సరైన సమయమని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్‌లో భాగం కావాలని ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. భారత్ రికార్డు స్థాయిలో రోడ్లు, నౌకాశ్రయాలపై పెట్టుబడులు పెడుతున్నదని, ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ భవిష్యత్తుకు చాలా ముఖ్యమని అన్నారు.
రచయితల కోసం ఓ గ్రామం
డెహ్రాడూన్: రచయితల కోసం ఓ ప్రత్యేక గ్రామాన్ని ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు. డెహ్రాడూన్‌కు 24 కిలోమీటర్ల దూరంలోని థానో గ్రామ సమీపంలో ఈ రచయితల గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రచయితలకు అనుకూలమైన నిశబ్ద, సృజనాత్మక వాతావరణాన్ని ఇక్కడ కల్పించారు.