న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీని జర్మనీ కంపెనీ పోర్షే అభివృద్ధి చేసింది. భౌతికంగా ఓ కేబుల్ కనెక్షన్ అవసరం లేకుండానే ఛార్జింగ్ చేయవచ్చునని తెలిపింది. 2026లో విడుదలయ్యే కేయెన్నే ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ టెక్నాలజీతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చునని పేర్కొంది.
తాము తయారు చేసిన ఛార్జింగ్ ప్యాడ్‌పైన కారును పార్క్ చేస్తే, ఛార్జింగ్ అవుతుందని వివరించింది. ఈ సిస్టమ్‌ను మ్యూనిచ్‌లో జరిగే ఐఏఏ మొబిలిటీ షోలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది.