General Dhiraj Seth | భారత 31వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరణ
General Dhiraj Seth : భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియాకు 31వ ఆర్మీ చీఫ్. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన జనరల్ ఉపేంద్ర ద్వివేది రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ నియామకయ్యారు.
General Dhiraj Seth : భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియాకు 31వ ఆర్మీ చీఫ్. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన జనరల్ ఉపేంద్ర ద్వివేది రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ నియామకయ్యారు. ఆయన బలమైన, స్వయం సమృద్ధి కలిగిన 1.3 మిలియన్ల భారత ఆర్మీకి నాయకత్వం వహిస్తారు. మహారాష్ట్ర, పూనేలోని ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన జనరల్ ధీరజ్ సేథ్ 1986 డిసెంబర్లో భారత ఆర్మీలో చేరారు.
ఇంతకుందు ఆయన ఆర్మీ స్టాఫ్‌కు వైస్ చీఫ్‌గా పని చేశారు. అలాగే సౌత్ కమాండ్‌కు, జైపూర్‌లోని సౌత్ వెస్టర్న్ కమాండ్‌కు నేతృత్వం వహించారు. రెండు ఆపరేషనల్ ఆర్మీ కమాండ్స్‌ను నడిపించిన కమాండర్లలో ఆయన కూడా ఒకరు. దాదాపు 40 ఏళ్లుగా ఆర్మీలో వివిధ హోదాల్లో సేవలందిస్తూ, అనేక ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. భారత ఆర్మీని ఆధునీకరించడంలో ధీరజ్ సేథ్ కీలక పాత్ర పోషించారు. వ్యూహాత్మక ప్రణాళికలు, సైనిక దళాల నిర్మాణం, సామర్ధ్యాల పెంపు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, మౌలిక వసతులు వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారు.
గత ఏప్రిల్ 1న వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన పూనేలోని సౌత్ కమాండ్‌కు నేతృత్వం వహించారు. గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ కమాండ్ కీలక పాత్ర పోషించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

