అహ్మదాబాద్: అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందించేందుకు దేశవ్యాప్తంగా ప్రపంచ శ్రేణి పాఠశాలలను నిర్మించనున్నట్టు అదానీ గ్రూపు చైర్పర్సన్ గౌతమ్ అదానీ సోమవారం ప్రకటించారు. ఇందు కోసం అదానీ కుటుంబం నుంచి రూ.2 వేల కోట్ల విరాళాన్ని ప్రాథమికంగా ప్రకటించారు.
ప్రపంచ శ్రేణి విద్యను, బోధనా సౌకర్యాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో తీసుకురావడమే తమ లక్ష్యమని అదానీ వెల్లడించారు. తమ భాగస్వామ్యంలో మొదటి పాఠశాల 2025-26 విద్యా సంవత్సరంలో లక్నోలో ప్రారంభమవుతుందని ఎక్స్ వేదికగా అదానీ ప్రకటించారు. తాము నిర్మించనున్న ప్రపంచ శ్రేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌లోని 30 శాతం సీట్లు పేద పిల్లలకు ఉచితంగా కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. మూడేండ్ల ఇలాంటి 20 బడులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.