ముంబై: నిజంగా మర్చిపోయాడో.. లేక కావాలని చేశాడో తెలియదు కానీ బీజేపీ నేత ఒకరు ఒంటిపై పైజమా లేకుండా కొద్ది సేపు అర్ధనగ్నంగా ఒక టెలివిజన్ షోలో కన్పించడం అందరినీ షాక్కు గురి చేసింది. దీనికి సంబంధించిన క్లిప్ సామాజిక మాధ్యమంలో విస్తృతంగా వైరల్ కావడంతో విపక్షాలు ఆయన చర్యను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
న్యూస్ 18 లో శుక్రవారం జరిగిన ‘ఆర్ పార్’ టెలివిజన్ షోకు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ పాటియా పైజమా లేకుండా గులాబీ రంగు కుర్తా మాత్రమే ధరించి ఒక ప్యానెల్ సభ్యుడిగా హాజరవ్వడం స్పష్టంగా కన్పించింది. ఈ వీడియోను సమాజ్వాది పార్టీ ఐటీ సెల్ షేర్ చేస్తూ ‘టీవీ షోలో సిగ్గు లేకుండా, అసహ్యకరంగా గౌరవ్ భాటియా టెలివిజన్ చర్చలో పైజామా లేకుండా కూర్చున్నాడు.
దానికి అతను సిగ్గు పడటం లేదా? నిజమైన బీజేపీ పాత్రను ప్రతిబింబించే గౌరవ్ భాటియా చర్యను అందరూ చూడాల్సిందే’ అంటూ విమర్శించింది. కాగా, గౌరవ్ భాటియా పైజామా ధరించకుండానే నేరుగా టీవీ షోకు వచ్చాడని అక్కడి వారు తెలిపారు. ఆయన చర్యను విపక్షాలు విమర్శించాయి.