జైపూర్ | పారిశ్రామిక కర్మాగారం నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. (Gas leakage) దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. ఇది చూసి స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్‌ను అదుపుచేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. విశ్వకర్మ పారిశ్రామిక ప్రాంతంలోని అజ్మీరా గ్యాస్ ప్లాంట్‌లో మంగళవారం గ్యాస్ లీక్ అయ్యింది. కార్బన్డైయాక్సిడ్ గ్యాస్ నిల్వ కోసం రెండు పెద్ద ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. అయితే గ్యాస్ ప్రెజర్ కారణంగా ఒక ట్యాంకర్ వాల్వ్ విరిగిపోయింది. దీంతో కార్బన్డైయాక్సిడ్ గ్యాస్ లీక్ అయ్యింది. గ్యాస్ పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్లాంట్‌లోని మెయిన్ వాల్వ్‌ను కట్టి గ్యాస్ లీక్‌ను అరికట్టారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే గ్యాస్ లీకేజీ వల్ల ఆ ప్రాంతంలో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొన్నదని ఫైర్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని చెప్పారు. మరోవైపు గ్యాస్ లీకేజీకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Panic gripped people due to gas leakage at an industrial unit in the Vishwakarma industrial area here on Tuesday, officials said, adding no casualties occurred.
The incident happened at the Ajmera gas plant where two big tankers were installed for the storage of CO2 gas. The… pic.twitter.com/PhUC8IYHwK
— IndiaToday (@IndiaToday) December 31, 2024