న్యూఢిల్లీ : రూ. 50 లక్షలు లంచం తీసుకునేందుకు అంగీకరించిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (GAIL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేబీ సింగ్‌ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. గెయిల్ అధికారికి లంచం ఇవ్వజూపిన వ్యక్తితో పాటు మరో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
నోయిడాలోని సింగ్ నివాసంలో కొద్ది గంటలపాటు నిర్వహించిన దాడుల అనంతరం ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. గెయిల్ ప్రాజెక్ట్‌లో అనుకూలంగా వ్యవహరించినందుకు భారీ మొత్తంలో లంచాన్ని సింగ్ డిమాండ్ చేశాడని సీబీఐ ఆరోపించింది.
ఢిల్లీ, నోయిడా, విశాఖపట్నం సహా పలు ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న కంపెనీల్లో ఒకటైన గెయిల్ అతిపెద్ద సహజవాయు ట్రాన్స్మిషన్, మార్కెటింగ్ కంపెనీగా పేరొందింది.
Read More :
Himayat Sagar | హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత.. మూసీలో పెరుగుతున్న వరద