Himayat Sagar | హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత.. మూసీలో పెరుగుతున్న వరద
హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉండటంతో అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Osman sagar) గేట్లను (Gates) ఎత్తివేశారు.
హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉండటంతో అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Osman sagar) గేట్లను (Gates) ఎత్తివేశారు. హిమాయత్ సాగర్‌లో నాలుగు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదిలేస్తున్నారు. హిమాయత్ సాగర్‌లో ప్రస్తుతం 1764 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ఇక ఉస్మాన్ సాగర్ జలాశయంలో రెండు గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి భారీగా వరద నీరు వస్తున్నది.
ఈనేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌లో లోయర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న కాలనీ వాసులను ఇండ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మూసారం బ్రిడ్జి వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

