మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 20:30:52

విభిన్న మాస్కులు.. వినూత్న వ్యాపారం..

విభిన్న మాస్కులు.. వినూత్న వ్యాపారం..

తమిళనాడు: కొవిడ్‌-19తో అన్ని వ్యాపారాలూ కోలుకోలేని దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గార్మెంట్‌ వ్యాపారులు దుకాణాలు నడవకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కాగా, తమిళనాడుకు చెందిన వస్త్ర కంపెనీలు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. కరోనా బారినుంచి తప్పించుకోవాలంటే మాస్కులు తప్పనిసరి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఫేస్‌మాస్కులకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని అవకాశంగా మల్చుకున్న తమిళ గార్మెంట్‌ వ్యాపారులు నూతన టెక్నాలజీని ఉపయోగించి విభిన్న రకాల మాస్కులు తయారుచేస్తున్నారు.

బ్యాక్టీరియా నిర్మూలన, వైరస్ క్లీనర్ ఫిల్టర్, కూల్‌, చెడు వాసనను తొలగించే మాస్కులను తయారుచేస్తున్నారు. అలాగే, ఈ వినూత్న మాస్కులపై పేటెంట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ‘లాక్‌డౌన్‌ సమయంలో చాలా ఇబ్బందిపడ్డా. కానీ, ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మాస్కుల ఉత్పత్తి ప్రారంభించా. డిమాండ్‌ పెరిగింది.’ అని ఓ వస్త్ర సంస్థ యజమాని బరాత్‌ చెప్పారు. ఇదిలా ఉండగా, ఇంతకుముందు వివిధ చిన్నాచితకా దుకాణాలు నిర్వహించుకునేవారు ఇప్పుడు ఫేస్‌మాస్కులను అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo