Ganguly’s Brother : భారత మాజీ క్రికెటర్ (Indian Former cricketer) సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) సోదరుడు స్నేహాశీష్ (Snehashish) కుటుంబానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒడిశా (Odisha) లోని పూరీ (Puri) తీరంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ (Speed boat) ఒక్కసారిగా తిరగబడింది. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్ వెంటనే రంగంలోకి దిగి వారిని రక్షించారు.
స్నేహాశీష్, అతడి భార్య అర్పిత పూరీ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోటులో సరిపడా ప్రయాణికులు లేకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని అర్పిత నిర్వాహకులపై మండిపడ్డారు. సముద్రంలో అప్పటికే అలల తీవ్రత ఎక్కువగా ఉందని, సాధారణంగా ఒక్కో స్పీడ్ బోటులో 10 మంది ప్రయాణికులు ఉండాలని, కానీ ఇక్కడ ఎక్కువ డబ్బులకు ఆశపడి కేవలం ముగ్గురు, నలుగురిని మాత్రమే ఎక్కించుకుంటున్నారని అర్పిత విమర్శించారు. బోటు తేలికగా ఉండటంతో భారీ అలలకు తిరగబడిందని ఆమె తెలిపారు.
లైఫ్ గార్డ్స్ లేకపోయి ఉంటే ఇవాళ తాము ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని అర్పిత ఆవేదన వ్యక్తం చేశారు. బోట్లను నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. కాగా సముద్రం నుంచి గంగూలీ సోదరుడిని, అతడి భార్యను రక్షిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా అయ్యాయి.