Gang War At Hospital | హాస్పిటల్లో గ్యాంగ్‌వార్.. పేషెంట్, మహిళా డాక్టర్‌పై గూండాల దాడి
Gang War At Hospital | హాస్పిటల్లో గ్యాంగ్‌వార్ (Gang War At Hospital ) జరిగింది. వార్డులోకి వచ్చిన గూండాలు ఒక పేషెంట్‌తోపాటు మహిళా డాక్టర్‌పై ఐరన్ రాడ్‌తో దాడి చేశారు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: హాస్పిటల్లో గ్యాంగ్‌వార్ (Gang War At Hospital ) జరిగింది. వార్డులోకి వచ్చిన గూండాలు ఒక పేషెంట్‌తోపాటు మహిళా డాక్టర్‌పై ఐరన్ రాడ్‌తో దాడి చేశారు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో ఈ సంఘటన జరిగింది. ఘాటి ప్రభుత్వ హాస్పిటల్లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. బెడ్‌పై ఉన్న ఒక రోగితో ఎవరి గురించో ఆరా తీశారు. తలపై గాయంతో డాక్టర్ వద్దకు వెళ్లిన వ్యక్తిపై ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ క్రమంలో అతడి పక్కనే ఉన్న మహిళా డాక్టర్ తలకు కూడా రాడ్ దెబ్బ తగిలింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
కాగా, ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి వార్డులోకి వచ్చారు. అయితే రోగి, మహిళా డాక్టర్‌పై గూండాల దాడిని వారు నిలువరించలేకపోయారు. అనంతరం ఈ సంఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించారు. గూండాల దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే దాడిని నివారించలేకపోయిన నలుగురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు.
మరోవైపు ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ దారుణ సంఘటనపై స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రెసిడెంట్ డాక్టర్లకు భద్రత కల్పించాలని సీఎం షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను డిమాండ్ చేశారు.
छत्रपती संभाजीनगर येथील घाटी रुग्णालयात घुसून एका टोळक्याने निवासी डॉक्टरांना रॉडने मारहाण केल्याची घटना घडली. हि अतिशय गंभीर बाब आहे. रुग्णालयात सेवा देणारे डॉक्टर्स देखील सुरक्षित नसतील तर रुग्णसेवा सक्षम कशी राहिल? मूळात या राज्याला पुर्णवेळ गृहमंत्री नाही. त्यामुळे हे प्रकार… https://t.co/Cq9rw8Up9K
— Supriya Sule (@supriya_sule) January 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

