Birthday Party | కాన్పూరు: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బుధవారం కొందరు రౌడీలు తమ గ్యాంగ్ లీడర్ పుట్టిన రోజును స్థానిక ప్రాంతం ‘దద్దరిల్లేలా’ జరిపారు. ఈ సందర్భంగా వారు రద్దీగా ఉండే లాల్ బంగ్లా మార్కెట్లో బాంబులు విసిరి, తుపాకులు పేల్చారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసి.. అదే మార్కెట్ చుట్టూ వారిని ఊరేగించారు. వ్యాపారుల్లో ధైర్యం నింపేందుకు నిందితులను మార్కెట్లో ఊరేగించామని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని నిందితులను హెచ్చరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.