ముంబై: ముంబైలో అత్యంత సంపన్న గణేశ్ మండపంగా పేరుపొందిన కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్కి ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో రూ. 474.46 కోట్ల విలువైన బీమా కవరేజీ లభించింది. గత ఏడాది బీమా పాలసీ రూ. 400 కోట్లు కాగా బంగారం, వెండి వస్తువుల విలువ పెరిగిన దృష్ట్యా బీమా కవరేజీ మరో రూ. 74.46 కోట్లు పెరిగింది. ఈ ఏడాది ఉత్సవాల కోసం అధికంగా సేవకులు, పూజారులను చేర్చుకోవడం కూడా మండల్ విలువ పెరగడానికి కారణమని తెలుస్తోంది.