నందుర్బర్: గాంధీధామ్-పూరి ఎక్స్‌ప్రెస్‌లో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని నందుర్బర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సూపర్‌ఫాస్ట్ రైలులోని ప్యాంట్రీ కార్ బోగీలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు ఎవ్వరికీ గాయాలు కాలేదు. రైలును ఆపి తక్షణమే సహాయక చర్యలు చేపట్టినట్లు వెస్ట్రన్ రైల్వే చీఫ్ ప్రతినిధి సుమిత్ థాకూర్ తెలిపారు. వంట చేసే బోగీలు మంటల్ని ఆర్పిన తర్వాత దాన్ని రైలు నుంచి డిటాచ్ చేశారు.