బెంగుళూరు: మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి.. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆ పార్టీ మొత్తం 47 స్థానాల్లో పోటీ చేసింది. కొప్పాల్ జిల్లా గంగావతి నుంచి పోటీ చేసి ఆయన ఒక్కరే ఆ పార్టీ తరపున గెలిచారు. మాజీ మంత్రి అయిన గాలి జనార్ధన్ రెడ్డి.. గతంలో బీజేపీ పార్టీలో చేశారు. ఓబులాపురం మైనింగ్ స్కామ్లో ఇరుక్కున్న ఆయన్ను బీజేపీ పక్కనపెట్టింది. గాలిపై పలు అక్రమ మైనింగ్ కేసులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి అన్సారిపై గాలి గెలిచారు. గంగావతిలో బీజేపీ మూడవ స్థానంలో నిలిచింది. బల్లారి సిటీ నుంచి పోటీ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి ఓడిపోయారు.