Rajnath Singh: కృత్రిమ మేధ ఒక్కటే కాదు.. సంకల్పం, సైనికులతోనే యుద్ధాల్లో గెలుస్తాం: మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆ యుద్ధనౌక జలప్రవేశం చేసింది. భవిష్యత్తులో యుద్ధాలు కృత్రిమ మేధతో పాటు సంకల్ప బలం, సైనికుల సత్తాతో గెలుస్తామని మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.
విశాఖపట్టణం: భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ఈ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, భారత నౌకాదళం శక్తి, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కృత్రిమ మేధతో జరుగుతాయని, కానీ దేశం పట్ల ప్రేమ, సుక్షితులైన సైనికులు, సమర్థవంతమైన సైనిక సత్తా ఉంటే యుద్ధాలను గెలవవచ్చు అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కొత్త శక్తికేంద్రంగా మారినట్లు ఆయన తెలిపారు. కొత్త టెక్నాలజీలు, సంప్రదాయ విధానాలు ఒకటికి ఒకటి వేరు కాదు అని, ఒకదానిపై ఒకటి ఆధారపడుతాయని, పోటీపడుతాయని, సంప్రదాయ ఫ్లాట్‌ఫామ్‌లు లేకుండా.. కొత్త టెక్నాలజీ అసంపూర్ణంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ యుద్ధనౌకలోని 75 శాతానికి పైగా భాగాలు స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడ్డాయి. భారతదేశంలోనే వీటిని తయారు చేశారు.భారతదేశ రూపకల్పన సామర్థ్యం, తయారీ నైపుణ్యం, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం, అలాగే దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ శక్తికి ఇది సజీవ నిదర్శనమని మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లో ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నిర్మించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధనౌకకు ఉందని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

