న్యూస్ పేపర్లలో ఫుడ్ ప్యాకేజింగ్ వద్దు.. అది ఏ మాత్రం సురక్షితం కాదు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక అడ్వైజరీ
న్యూస్ పేపర్లలో చుట్టి అమ్ముతున్న సమోసాలు, పకోడీలు, ఇతర తినుబండారాలు ఆరగిస్తున్నారా? ఇది ఆరోగ్యపరంగా ఎంతమాత్రం క్షేమకరం కాదని హెచ్చరిస్తున్నది భారత అహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎస్ఐ).
న్యూఢిల్లీ, జూన్ 7: న్యూస్ పేపర్లలో చుట్టి అమ్ముతున్న సమోసాలు, పకోడీలు, ఇతర తినుబండారాలు ఆరగిస్తున్నారా? ఇది ఆరోగ్యపరంగా ఎంతమాత్రం క్షేమకరం కాదని హెచ్చరిస్తున్నది భారత అహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎస్ఐ). ఆహార అమ్మకందారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు వెంటనే ఈ విధానానికి స్వస్తి పలుకాలని మరోసారి ఆదేశించింది. ఆహార పదార్థ్ధాలను దినపత్రికలలో ప్యాక్ చేయడం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నది. దినపత్రిక ముద్రణకు వాడే ఇంక్‌లో ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలు వాడుతారని, న్యూస్ పేపర్లలో సమోసాలు, పకోడీలు, వడాపావ్ లాంటి ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల అవి కరిగి ఆ ఆహార పదార్థాలకు, పదార్థాల్లో ఉపయోగించే ఆయిల్‌కు అంటుకుంటాయని తెలిపింది.
తద్వారా ప్రమాదకర విష రసాయనాలు, లోహ పదార్థాలు శరీరంలోకి వెళ్లి తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తాయని ఈ నియంత్రణ సంస్థ తెలిపింది. ఇకపై ఆహార పదార్థాలను దినపత్రికలు, ఇతర ప్రింటింగ్ వస్తువుల్లో ఉంచి ఎట్టి పరిస్థితుల్లో అమ్మకాలు సాగించ రాదని ఈ సంస్థ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తమ సంస్థ ఆమోదించిన, సూచించిన ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్ పదార్థాలు, కంటైనర్లనే వ్యాపారులు వినియోగించాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

