న్యూఢిల్లీ: ఎ1, ఎ2 రకాల పాలు, పాల ఉత్పత్తులంటూ ప్యాకేజింగ్‌లో చేస్తున్న ప్రచారాన్ని ఆహార వ్యాపార కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గురువారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ తరహా ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని తెలిపింది. ఈ తరహా ప్రచారం ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006కు అనుగుణంగా లేదని తెలిపింది. పాలలోని బీటా కెరోటిన్ ప్రొటీన్ నిర్మాణానికి సంబంధించిన తేడాలను బట్టి ఎ1, ఎ2 పాలుగా వర్గీకరిస్తున్నారని.. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం తమ సంస్థ ఈ తేడాలను గుర్తించదని వెల్లడించింది.