న్యూఢిల్లీ, జూన్ 16: తుప్పుపట్టిన కత్తులకు స్వస్తి పలుకండి అంటూ దేశవ్యాప్తంగా ఉన్న ఆహార సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అడ్వైజరీ జారీ చేసింది. ఆహార సంస్థలు ఆహార, ప్యాకేజింగ్ కార్యక్రమాల్లో తుప్పుపట్టని, ఆహార వినియోగానికి అనువుగా ఉండే సురక్షిత గ్రేడ్ కత్తులు, బ్లేడ్లను వినియోగించాలని కోరింది.
కొన్ని ఆహార సంస్థలు తుప్పుపట్టిన, రంగు వేసిన, చిట్లిపోయిన, పాడైపోయిన, ఏమాత్రం వినియోగానికి అనువుగా లేని కత్తులు, బ్లేడ్లను ఆహార తయారీ, ప్రాసెసింగ్, కటింగ్, ప్యాకేజింగ్‌లో వినియోగిస్తున్నారని తెలిపింది. కొం దరు పాడైపోయిన కత్తులను ఏమాత్రం శుభ్రం చేయకుండా వాడటం వల్ల తుప్పు, కెమికల్స్ వినియోగదారుల శరీరంలోకి వెళ్లి అనారోగ్య హేతువులవుతున్నాయని పేర్కొన్నది. పాతవాటికి స్వస్తి పలికి కొత్తవి ప్రవేశపెట్టాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ తన అడ్వైజరీలో కోరింది.