Fruit Dosa | సోషల్ మీడియా వల్ల వెరైటీ వంటకాల గురించి తెలుసుకునే భాగ్యం మనకు కలుగుతోంది. ఇటీవలే కదా.. ఐస్క్రీమ్ పానీపూరీ, గులాబ్ జామున్ పానీపూరీ, ఓరియో పకోడీ, యాపిల్ పకోడీ లాంటి వింత వంటకాలను చూశాం. తాజాగా ఫ్రూట్ దోశ గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఓ స్ట్రీట్ వెండర్ వెరైటీగా ఫ్రూట్ దోశను తయారు చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాన్ని ఎలా తయారు చేస్తారో ఆ వీడియోను షేర్ చేయడంతో నెటిజన్లు చూసి.. యాక్ ఇలాంటి దోశను కూడా తయారు చేస్తారా.. అన్నీ మిక్స్ చేసి కలగాపులగంలా చేశారు ఆ దోశను. దోశకు ఉన్న వాల్యూను మొత్తం తీసేశారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక.. ఆ దోశ మీద అన్ని రకాల ఫ్రూట్స్ ముక్కలు వేసి.. దాని మీద చీజ్ వేసి ఆ తర్వాత మరికొన్ని పండ్ల ముక్కలు వేసి టుట్టి ఫ్రూటీ వేసి ఆ దోశను తయారు చేస్తున్నారు. ఇటీవల మసాలా దోళ ఐస్క్రీమ్ రోల్ అనే సరికొత్త వంటకంపై కూడా ఇలాగే సోషల్ మీడియాలో చర్చ నడిసింది. తాజాగా ఫ్రూట్ దోశపై చర్చ నడుస్తోంది.