Viral Video : మనలో చాలా మంది ఫిట్నెస్ ప్రియులు వర్కవుట్లు చేస్తూ సెలబ్రిటీలు, పోషకాహార నిపుణుల సూచించే డైట్‌ను ఫాలో అవుతుంటారు. రోజువారీ తీసుకునే ఆహార నియమాలను కఠినంగా ఫాలో అవుతుంటారు. ఆరోగ్యకర ఆహారంపై హాట్ డిబేట్స్ సాగిస్తుంటారు. అయితే దీనిపైనే ఇద్దరు నటులు ఓ వీడియో చేశారు. మన్దీప్ సెహ్రావట్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఏకంగా 40 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
ఈ క్లిప్‌లో ఇద్దరు వ్యక్తులు జంక్ ఫుడ్ తింటూ ఆరోగ్యకర ఆహారంపై చర్చించడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోపై పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు అథ్లెట్ల ఆహారంపై, రొనాల్డో బయలాజికల్ ఏజ్‌పై సీరియస్‌గా చర్చిస్తుండటం కనిపిస్తుంది. ఆరోగ్యకర ఆహారంపై ఓవైపు ఈ చర్చ సాగిస్తూనే వారు తమ ప్లేట్లలో చిప్స్ సహా జంక్ ఫుడ్ లాగిస్తూ సాఫ్ట్ డ్రింక్ తీసుకోవడం చూడొచ్చు.
బ్రదర్ ఇదంతా హెల్ధీ ఫుడ్ తీసుకోవడం వల్లే అంటూ ఓ వ్యక్తి చౌమీన్ తింటూ చెబుతుంటే మరోవ్యక్తి కార్బోనేటెడ్ డ్రింక్ తాగుతూ అల్కాలీన్ వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు వల్లెవేస్తాడు. ఆ అథ్లెట్ల డైట్ ప్లాన్‌పై అందరూ దృష్టిసారించాలని చెబుతుంటారు. ఇక వారు ఓవైపు చాప్, మోమోస్ లాగిస్తూ బయోటిన్ లోపంపై చర్చ చేయడం ఈ క్లిప్‌లో చూడొచ్చు.
Read More :