కొంతకాలంగా తనతో స్నేహం చేస్తున్న యువతి.. మరో వ్యక్తితో స్నేహం పెంచుకుంటోందని అనుమానం వచ్చిందా వ్యక్తికి. దీంతో ఆ రాత్రి ఆమె ఇంట్లో పడుకుంటానని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర లేచి గొడ్డలితో స్నేహితురాలిని నరికి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. ఆశా దేవి (33) అనే యువతి భర్త నుంచి విడిపోయి విడిగా ఉంటోంది. ఆమె తన ఇంటికి సమీపంలో జూస్ షాప్ నడిపే నదీమ్ అహ్మద్ (25) అనే వ్యక్తితో కొంతకాలంగా స్నేహం చేస్తోంది.
ఇలాంటి సమయంలో ఆమె వేరే వ్యక్తితో స్నేహం పెంచుకుంటోందని నదీమ్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఒక రోజు రాత్రి ఆశా దేవి ఇంట్లో పడుకుంటానని చెప్పిన నదీమ్.. తెల్లవారుజాము 3 గంటల సమయంలో లేచి గొడ్డలితో దాడిచేసి ఆమెను దారుణంగా చంపేశాడు. మరుసటిరోజు పక్కింటి వాళ్లు ఆశాదేవి ఇంటికి వచ్చినప్పుడు రక్తపు మడుగులో పడి ఉన్న, ఆమె మృతదేహాన్ని చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి.. నదీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.