Karnataka Water Crisis | నీటి కటకటతో ఫ్రెండ్‌కు పిల్లనివ్వడం లేదు.. సమస్య పరిష్కరించాలని రాహుల్‌కు నెటిజన్ రిక్వెస్ట్..!
Karnataka Water Crisis | కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా పేరొందిన నగరంలో రిజర్వాయర్లు వేసవికి ముందు ఎండిపోయాయి. ప్రస్తుతం నగరంలో తాగునీటి కటకటపై కాంగ్రెస్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది.
Karnataka Water Crisis | కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా పేరొందిన నగరంలో రిజర్వాయర్లు వేసవికి ముందు ఎండిపోయాయి. ప్రస్తుతం నగరంలో తాగునీటి కటకటపై కాంగ్రెస్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రజలకు నీటి వాడకం విషయంలో సూచనలు చేసింది. మరో వైపు నగర వాసులు నీటి కోసం ట్యాంకర్లను కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ట్యాంకర్లు కొనుగోలు చేసేందుకు భారీగా ధరను చెల్లించాల్సి వస్తున్నది. మరో వైపు సమస్యను పరిష్కరించాలని ఓ వ్యక్తి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం పోస్ట్ వైరల్‌గా మారింది. నరేంద్ర వ్యక్తి ఎక్స్(ట్విట్టర్)లో ‘రాహుల్ గాంధీజీ దయచేసి బెంగళూరులో నీటి సంక్షోభాన్ని ముగించేందుకు చర్యలు తీసుకోండి. బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీలో పని చేస్తున్న నా స్నేహితుడు ఇటీవల తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కోసం చూస్తున్నాడు. కానీ, బెంగళూరులో నీటి సమస్య కారణంగా అతన్ని పెళ్లి చేసుకునేందుకు ముందుకురావడం లేదు’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం బెంగళూరులో నీటి కొరతపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.
గత మూడు నాలుగు దశాబ్దాల్లో కర్ణాటకలో ఇంత తీవ్రమైన కరువు కనిపించలేదన్నారు. గతంలో కరువు ఏర్పడిందని.. ఇంత పెద్ద సంఖ్యలో తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ఎన్నడూ ప్రకటించలేదన్నారు. కావేరి నదీజలాలు సరఫరా అవుతున్నాయన్నారు. బెంగళూరులో దాదాపు 13,900 బోర్‌వెల్స్‌లో 6,900 బోర్వెల్లు పనిచేయడం చెప్పారు. పరిస్థితులు అదుపులోకి తెస్తున్నామని.. నీటి సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

