Uttarakhand : ఉత్తరాఖాండ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరకాశీలోని ధరాలి (Dharali)లో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation)కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దాంతో, ఆరో రోజు సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో, వందలాది మంది ఆచూకీ తెలుసుకోవడం గగనంగా మారింది. అయితే.. ఇప్పటివరకూ రెస్క్యూ టీమ్స్ 1,000 మందిని రక్షించాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధాము (Pushkar Singh Dhamu) తెలిపారు. గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఊహించని వరద ప్రవాహం, కొండచరియలు విరిగిపడడంతో ఉత్తరకాశీలోని ధరాలీలో వందలాది మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. జల విలయంతో అల్లాడిపోయిన ఈ ప్రాంతం నుంచి ఐదుగురిని సురక్షింతంగా బయటకుతీసుకొచ్చాయి రెస్క్యూ బృందాలు.
#WATCH | Uttarkashi, Uttarakhand: Search and rescue operation underway in the Dharali-Harsil area following a cloudburst. pic.twitter.com/C3qbT39ntu
— ANI (@ANI) August 10, 2025
వర దధాటికి ఎక్కడికక్కడే చిక్కుకుపోయిన పర్యటకులను కాపాడేందుకు రంగంలోకి దిగిన భారత సైన్యం 33 సైనిక హెలిక్యాప్టర్లను ఉపయోగించి 195 మంది ప్రజలను.. కొండచరియలు విరిగిపడిన చోట చిక్కుకుపోయిన దాదాపు 200 మంది టూరిస్టులను కాపాడిందని సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని జిల్లా సమాచారా అధికారి చెబుతున్నారు. హర్సిల్, ముఖ్వాతో పాటుఉఉ ధరాలిలోని పలు ప్రాంతాల్లో నీళ్లు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు ఆయన పేర్కొన్నారు.
వంతెన పునరుద్ధరణ పనుల్లో భారత సైన్యం
ఆగస్టు 9న హర్సిల్ను కలిపే రోడ్డు మార్గం పాడైంది. దాంతో, సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. వరద ఉధృతికి దెబ్బతిన్న రిషికేష్ – గంగోత్రి జాతీయ రహదారి 34 కలిపే లిమ్చిగడ్ ప్రాంతంలోని బెయిలీ బ్రిడ్జికి భారత సైన్యం మరమ్మతులు చేస్తోంది సైన్యం.