Liver Cancer | న్యూఢిల్లీ : రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చునని ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనం తేల్చింది. కూరగాయలు, పండ్లు తినటం వల్ల ఏమైనా లాభముందా? అని 179 మంది లివర్ క్యాన్సర్ రోగులపై ఫ్రెంచ్ సైంటిస్టులు అధ్యయనం చేశారు.
రోజూ అదనంగా 240 గ్రాముల కూరగాయలు తినటం ద్వారా రోగుల్లో వ్యాధి తగ్గుదల 65 శాతం వరకు కనపడిందని పరిశోధనలో తేలింది. దీనిపై విస్తృతస్థాయి పరిశోధనలు చేయాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు చెప్పారు.