న్యూఢిల్లీ : ప్రతికా స్వేచ్ఛను హరించేలా పీఆర్పీ (ప్రెస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్), డీపీడీపీ (డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్) బిల్లులను కేంద్రం తీసుకొస్తున్నదని ‘ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార యంత్రాంగానికి ఏకపక్ష అధికారాలను ఈ బిల్లులు కల్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు బిల్లులను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ధన్కర్ తదితరలకు లేఖలు రాసింది. అపరిమిత అధికారాలు దుర్వినియోగం అయ్యే అవకాశముందని ఎడిటర్స్ గిల్డ్ హెచ్చరించింది.