బెంగళూరు: చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 వంటి ప్రతిష్ఠాత్మక మిషన్లను విజయవంతంగా చేపట్టడంలో మన శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉన్నది. మరి వీరు అంత ఉత్సాహంగా, రెట్టించిన శక్తితో ఎలా పనిచేస్తున్నారు? అసలు మీ మోటివేషన్ ఏంటని అడిగితే వారు చెప్పిన సమాధానం ‘మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ’. మరోవైపు ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ ఇటీవల వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. ‘దేశం, ప్రపంచంలోని ఏ ఇతర కంపెనీల సైంటిస్టులతో పోలిస్తే మా సైంటిస్టులు ఎంతో ఎక్కువగా శ్రమపడతారు. వారితో పోలిస్తే చాలా తక్కువ జీతాలు తీసుకుంటారు. సాధారణ జీవితం గడుపుతారు, పనిగంటలు, డబ్బు గురించి పట్టించుకోరు’ అని అన్నారు.