Train derail | గూడ్స్ రైలు బోల్తా.. ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం
Train derail | మహారాష్ట్రలో గూడ్స్ రైలు బోల్తా పడింది. రైలు పాన్వెల్ నుంచి వసాయ్కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దాంతో కళ్యాణ్, కుర్లా నుంచి ఘటనా ప్రాంతానికి యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లను పంపించారు.
ముంబై: మహారాష్ట్రలో గూడ్స్ రైలు బోల్తా పడింది. రైలు పాన్వెల్ నుంచి వసాయ్కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దాంతో కళ్యాణ్, కుర్లా రైల్వే స్టేషన్ల నుంచి ఘటనా ప్రాంతానికి యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లను పంపించారు. గూడ్స్ రైలు బోల్తా పడటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. బోల్తా పడిన బోగీలను రైలు పట్టాల పై నుంచి తొలగించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. రైలు బోల్తా పడటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

