పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊరు చివరలో కొంత మంది కూలీలు బావి తవ్వతుండగా ప్రమాదవశాత్తు నేల కుప్పకూలి వారిపై పడింది. దాంతో నలుగురు కూలీలు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, అధికారులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) తో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
బావి తవ్వే పనికి వెళ్లిన కూలీలు ఇళ్లకు తిరిగి రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు వెతుక్కుంటూ పని ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బావిలో మట్టి కూలిపోయి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రెస్క్యూ సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. మట్టిలో కూరుకుపోయినందున వాళ్లు బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని పోలీసులు అంచనా వేస్తున్నారు.
#WATCH | NDRF team deployed for rescue operation at the site where four labourers are trapped under debris after soil cave-in during the construction of a well in Mahsobawadi village of Indapur Tehsil of Pune district, Maharashtra
(Earlier visuals from the site; Video… pic.twitter.com/mUu7YK6AA2
— ANI (@ANI) August 2, 2023