firecracker factory | తమిళనాడులో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణసంచా ఫ్యాక్టరీ (firecracker factory)లో పేలుడు (explosion) సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. విరుదునగర్ (Virudhunagar) జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
జిల్లా ఎస్పీ కన్నన్ తెలిపిన వివరాల ప్రకారం.. శివకాశి (Sivakasi) సమీపంలోని చిన్నకామన్పట్టి (Chinnakamanpatti)లో గల బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విరుదునగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కన్నన్ తెలిపారు.
Tamil Nadu | Four people died and five others were injured in an explosion at a firecracker factory in Chinnakamanpatti near Sivakasi. They were admitted to the Virudhunagar government hospital for treatment. More details awaited: Virudhunagar District SP Kannan
— ANI (@ANI) July 1, 2025
Also Read..
Sugar Mill | షుగర్ మిల్లోకి పోటెత్తిన వరద.. కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార
Beas River | హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బియాస్ నది.. VIDEOS