న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నదని తెలిపారు.
ఒడిశా-జార్ఖండ్ సరిహద్దుల్లో శనివారం మావోయిస్టుల కోసం గాలింపు జరుపుతున్న సమయంలో ఐఈడీ పేలడంతో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ సత్యబన్ కుమార్ సింగ్ (34) మరణించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్‌కు చెందినవారు. ఓ స్టోన్ క్వారీ నుంచి మావోయిస్టులు దొంగిలించిన పేలుడు పదార్థాల కోసం అడవిలో గాలింపు జరుపుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.