Maharashtra | హైదరాబాద్ : మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఎన్కౌంటర్ జరిగింది. భమ్రాగఢ్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతోపాటు పలువురు కీలక నేతలు సైతం ఉన్నారు. నంబాల కేశవరావుపై రూ. కోటిన్నర రివార్డు ఉన్న సంగతి తెలిసిందే.