కుభీర్, ఆగస్టు 31: మహారాష్ట్రలోని తోటంబ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. పార్డి(బీ) గ్రామానికి చెందిన 14 మంది శ్రావణ సోమవారం కావడంతో శివాలయాలను దర్శించుకొనేందుకు కైలాస్ టేక్డిలోని శివాలయంతోపాటు మహారాష్ట్రలోని సహస్రకుండ్ సందర్శనకు ఉదయం జీపులో వెళ్లారు.
దర్శనానంతరం తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తోటంబ వద్ద జరిగిన వీరు ప్రయాణిస్తున్న జీపు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ దాగాం తులసీరామ్(28)తోపాటు ఆవుల గంగాధర్ (65), తూము సాయిలు (64), తూము గౌరాబాయి (70) అక్కడికక్కడే మరణించారు.