కోల్‌కతా, జూన్ 21: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించారు. 41 ఏండ్ల సుచేతన భట్టాచార్య ఆపరేషన్‌తో పురుషునిగా మారాలనుకుంటున్నట్టు ప్రకటించారు. న్యాయ సలహాలు తీసుకోవడంతో పాటు సైకియాట్రిస్టులను కలిసి ఈ ప్రక్రియకు అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మానసికంగా తాను మగవాడినన్న విషయాన్ని ఎప్పుడో గుర్తించానని, ఇప్పుడు భౌతికంగా మగవాడిగా తయారై సుచేతన నుంచి సుచేతన్‌గా మారాలనుకుంటున్నానని తెలిపారు. ‘లోపం గురించి తల్లిదండ్రులకు చిన్నప్పటి నుంచి తెలుసు. వారి అంగీకారంతోనే నేనీ నిర్ణయం తీసుకున్నా’ అని ఆమె పేర్కొన్నారు.