Tillakaratne Dilshan | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్!
Tirumala | శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
Tirumala | శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న TG20 లీగ్‌లో ‘ఖమ్మం ఏసెస్’ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఆయన, హైదరాబాద్ షెడ్యూల్ మధ్యలో లభించిన విరామ సమయంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
దిల్షాన్ ఆదివారం ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆయన ధోతి ధరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలకగా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన తిలకరత్నే దిల్షాన్‌ను చూసేందుకు భక్తులు, క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీల కోసం పోటీ పడగా, దిల్షాన్ కూడా ఎంతో ఓపికగా నవ్వుతూ అభిమానులకు అభివాదం చేస్తూ సెల్ఫీలు ఇచ్చారు.
Former Sri Lankan Cricketer Dilshan prays at Tirumala temple. pic.twitter.com/Ai95vfJCfY
— News Arena India (@NewsArenaIndia) June 28, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

