న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ కన్నుమూశారు. 92 ఏండ్ల వెంకటరమణన్ స్వల్ప అస్వస్థతతో శనివారం మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఐఏఎస్ అధికారి అయిన వెంకటరమణన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18వ గవర్నర్గా 1990 డిసెంబర్ నుంచి 1992 డిసెంబర్ వరకు పనిచేశారు. ఫైనాన్స్ సెక్రటరీగా, కర్ణాటక ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించారు.