బెంగళూరు: కర్ణాటక మాజీ పోలీసు చీఫ్ ఓం ప్రకాష్ తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై కత్తి గాయాలు, నేలపై రక్తాన్ని పోలీసులు గమనించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆయనను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. (Former Police Chief Found Dead) భార్యను అదుపులోకి తీసుకున్నారు. 68 ఏళ్ల ఓం ప్రకాష్ బెంగళూరులోని మూడంతస్తుల బిల్డింగ్‌లో నివసిస్తున్నారు. ఆదివారం ఇంట్లో అనుమానాస్పదంగా ఆయన మరణించినట్లు భార్య పల్లవి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
కాగా, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఓం ప్రకాష్ కత్తి గాయాలతో మరణించినట్లు గమనించారు. నేలపై రక్తం కారి ఉండటాన్ని గమనించారు. ఓం ప్రకాష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య పల్లవిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమెతోపాటు కూతురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు బీహార్‌లోని చంపారన్‌కు చెందిన ఓం ప్రకాష్ 1981 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. 2015 మార్చిలో కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఆయన నియమితులయ్యారు. 2017లో ఆ హోదాలో పదవీవిరమరణ చేశారు. దీనికి ముందు కర్ణాటక ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హోంగార్డ్స్ చీఫ్‌గా వ్యవహరించారు.