Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Election Commission : 124 మంది మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్లు ఎన్నికల సంఘానికి (ఈసీ) మద్దతు తెలిపారు. ఈ మేరకు వారంతా శనివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఎన్నికల సంఘం పనితీరు, వ్యవస్తలో వచ్చిన మార్పులపై ప్రస్తావించారు.
Election Commission : ఎన్నికల సంఘం పనితీరు, సర్ పేరిట అవకతవకలు, సీఈసీ రాజీనామా అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఈసీని, సర్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే.. పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన మాజీ జడ్జీలు సీఈసీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు 124 మంది మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్లు ఎన్నికల సంఘానికి (ఈసీ) మద్దతు తెలిపారు. ఈ మేరకు వారంతా శనివారం బహిరంగ లేఖ రాశారు.
ఈ లేఖలో ఎన్నికల సంఘం పనితీరు, వ్యవస్తలో వచ్చిన మార్పులపై కీలక అంశాల్ని ప్రస్తావించారు. సరైన ఆధారాలు లేకుండా ఓట్ల చోరీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వారి లేఖ ప్రకారం.. గతంలో ఎన్నికల సమయంలో బూత్‌లను ఆక్రమించడం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, హింసకు పాల్పడటం వంటివి నిత్యం జరిగేవి. ఇప్పటి ఎన్నికల విధానంలో ఇలాంటివి లేకుండా అనేక దశల్లో తనిఖీలు, రక్షణ చర్యలు ఉన్నాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించడం, ఈవీఎంలకు సీలింగ్ వేయడం, స్ట్రాంగ్ రూంలలకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం, వీవీప్యాట్ల తనిఖీ వంటివి జరుగుతున్నాయి.
తాము గెలిచినప్పుడు ఎన్నికల వ్యవస్థ సరిగ్గానే ఉన్నట్లు, ఓడినప్పుడు వ్యవస్థలో అక్రమాలు జరిగాయనడం సరికాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి.. అనేక రాష్ట్రాల్లో ఓడిపోయిన సంగతిని గుర్తించాలి. బలమైన ఆధారాలు లేకుండా వోట్ల చోరీ అంటూ ఎన్నికల సంఘం పనితీరుపై ఆరోపణలు చేయడం సరికాదు అంటూ లేఖలో ప్రస్తావించారు. సర్ ప్రక్రియకు మద్దతు తెలిపారు. లేఖ రాసిన వారిలో కేంద్ర విదేశాంగ శాఖ మాజీ సెక్రెటరీ కన్వల్ సిబల్, మాజీ ఐఏఎస్‌లు ఆర్డీ కపూర్, సమిరేంద్ర చటర్జీ, గోపాల క్రిష్ణ, వివేక్ భరద్వాజ్, నవ్‌నీత్ సెహగల్ వంటి ప్రముఖులున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Election commission
- IAS
- IFS
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

