న్యూఢిల్లీ, మే 31: వ్యాపారవేత్త నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మహదేవ్ బెట్టింగ్ యాప్ వంటి పలు సంచలనాత్మక మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తునకు నేతృత్వం వహించిన ఈడీ మాజీ స్పెషల్ డైరెక్టర్ సత్యబ్రత కుమార్ హఠాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2004 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన సత్యబ్రతను ఈడీ నుంచి వెనక్కి పిలవడంతో సరిగ్గా ఏడాది క్రితం కమిషనర్ (అప్పీల్స్)గా ఆయనకు పశ్చిమ బెంగాల్లో పోస్టింగ్ ఇచ్చారు.