డెహ్రాడూన్ : ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డుల ప్రదానోత్సవం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో నేడు ఘనంగా జరిగింది.
గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ ఏడాది తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్ ఐపీఎస్ (రిటైర్డ్), సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిణి మీనాక్షి నేగిలకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ప్రజా సేవలో, శాంతిభద్రతల పరిరక్షణలో వారు చేసిన సుదీర్ఘ, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
సింపోజియం ట్రస్టీ శ్రుతి మాల్పానికి భారత్ గౌరవ్ అవార్డు ప్రదానం చేశారు
భారత్ గౌరవ్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గవర్నర్ గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులను గౌరవించుకోవడం దేశానికి గర్వకారణమని అన్నారు. దేశ ప్రగతికి అసాధారణ కృషి చేసిన వారికి ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారం ఇది. ఏటా 20 మందికి భారత్ గౌరవ్ అవార్డు, 5 మందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇస్తారు. కలెక్టర్, ఎస్పీ లేదా ఎంపీ సిఫార్సుతో వచ్చిన దరఖాస్తులను స్వతంత్ర కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుంది.