న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మాజీ ముఖ్యమంత్రి, కల్పాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆతిశీని ఆప్ ఎమ్మెల్యేలు ఆదివారం ఎన్నుకున్నారు. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు అంద రూ ఆతిశీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆప్ ఢిల్లీ విభాగం కన్వీనర్ గోపాల్ రాయ్ విలేకరులకు తెలిపారు. సభలో బలమైన ప్రతిపక్షం పాత్ర ఎలా ఉండనున్నదో తాము చూపిస్తామని ఆతిశీ చెప్పారు. ఢిల్లీ మహిళలకు నెలకు రూ. 2,500 వాగ్దానం అమలయ్యేలా పోరాడతామని ఆమె అన్నారు.