
ఘజియాబాద్ (యూపీ), డిసెంబర్ 6: ఇస్లాం నుంచి బహిష్కరణకు గురైన ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సోమవారం హిందూమతంలోకి మారారు. తన పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను ఇస్లాం నుంచి బహిష్కరించారు. నాకు నచ్చిన మతాన్ని ఆచరించడం, ప్రచారం చేయడం ఇక నా ఇష్టం. అందుకే ఈ రోజు హిందూమతంలోకి మారాను. సనాతన ధర్మం.. ప్రపంచంలోనే మొదటి ధర్మం. నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను’ అని అన్నారు.