డెహ్రాడూన్, మే 30: అంకితా భండారీ అనే 19 ఏళ్ల రిసెప్షనిస్టు హత్య కేసులో మాజీ బీజేపీ నాయకుడి కుమారుడు పుల్కిత్ ఆర్యతోపాటు మరో ఇద్దరు నిందితులకు ఉత్తరాఖండ్‌లోని సెషన్స్ కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. పుల్కిత్ ఆర్యతోపాటు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలకు రూ. 50,000 చొప్పున కోట్ద్వార్లోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జరిమానా విధించింది.
ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లా యంకేశ్వర్ ప్రాంతంలోని పుల్కిత్ ఆర్యకు చెందిన వనంతార రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న అంకిత్ గుప్తా 2022లో హత్యకు గురైంది. 2022 సెప్టెంబర్ 18న అంకిత కనిపించకుండా పోయింది. చిలా కాల్వలో ఆమె మృతదేహం లభించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రత, రాజకీయ పలుకుబడి, న్యాయస్థానాలలో జాప్యంపై చర్చకు దారితీసింది.