Debashish Samantaray: బీజేపీలో చేరిన బీజూ జనతా దళ్ ఎంపీ దేబషిశ్ సమంతరే
Debashish Samantaray: బీజూ జనతా దళ్ మాజీ రాజ్యసభ ఎంపీ దేబషిశ్ సమంతరే ఇవాళ బీజేపీలో చేరారు. సోమవారం ఆయన బీజేడీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేడీ నాయకత్వాన్ని విమర్శించారు. ప్రజల ప్రయోజనం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: బీజూ జనతా దళ్ మాజీ రాజ్యసభ ఎంపీ దేబషిశ్ సమంతరే(Debashish Samantaray) ఇవాళ బీజేపీలో చేరారు. సోమవారం ఆయన బీజేడీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేడీ నాయకత్వాన్ని విమర్శించారు. ప్రజల ప్రయోజనం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా కఠినమైన మార్పు అని, కానీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బీజేడీ పార్టీలో ఆయన చాన్నాళ్లూ అనేక హోదాల్లో పని చేశారు. బీజేడీని వీడిన మూడవ రాజ్యసభ ఎంపీగా దేబషిశ్ నిలిచారు. ఇటీవల మమతా మోహంతా, సుజిత్ కుమార్ కూడా బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. ఏప్రిల్ 2030 వరకు దేబషిశ్ టర్మ్ ఉన్నది. రాజ్యసభలోకి రావడానికి ముందు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమంతరే వైదొలగడంతో రాజ్యసభలో బీజేడీ బలం కేవలం అయిదుకు చేరుకున్నది.
#WATCH | Delhi | MP Debashish Samantaray joins Bharatiya Janata Party, after he resigned from Biju Janata Dal today. pic.twitter.com/5NJ038kils
— ANI (@ANI) May 26, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

