పాట్నా: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌యాదవ్ కూతురు రోహిణి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కుటుంబ సంబంధాలతోనూ దూరం జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రోహిణి ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాజకీయాలు, కుటుంబం నుంచి వైదొలగాలంటూ అర్జేడీ అధ్యక్షుడు తేజస్వి సన్నిహితులైన ఇద్దరు నాయకులు సూచించడంతోనే రోహిణి ఈ నిర్ణయం తీసుకున్నారు.