Kewal Dhillon: పంజాబ్ బీజేపీ చీఫ్‌గా కేవల్ థిల్లాన్
Kewal Dhillon: బర్నాలా మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ ధిల్లాన్.. పంజాబ్ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరింద్ సింగ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. థిల్లాన్ పేరును బీజేపీ పార్టీ ఫైనలైజ్ చేసింది.
చండీఘడ్: బర్నాలా మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ ధిల్లాన్(Kewal Dhillon).. పంజాబ్ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరింద్ సింగ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. థిల్లాన్ పేరును బీజేపీ పార్టీ ఫైనలైజ్ చేసింది. థిల్లాన్ వయసు 75 ఏళ్లు. బర్నాలా జిల్లాలోని తల్లేవాల్ గ్రామంలో ఆయన జన్మించారు. 2007 నుంచి 2017 వరకు బర్నాలా ఎమ్మెల్యేగా ఆయన చేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ నేత గుర్మీత్ సింగ్ మీట్ హయర్ చేతిలో ఆయన ఓడిపోయారు. దాంతో ఆయన 2022లో బీజేపీలో చేరారు. జాట్ వర్గ సిక్కు నేతగా ఆయనకు గుర్తింపు ఉన్నది. బీజేపీలో చేరిన తర్వాత పంజాబ్ యూనిట్‌కు ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2027లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పంజాబ్‌లో రాజకీయ పార్టీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. హర్యానా బీజేపీ యూనిట్‌కు అర్చనా గుప్తాను ప్రెసిడెంట్‌గా బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ చీఫ్‌గా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా, త్రిపుర బీజేపీ చీఫ్‌గా అభిషేక్ డేబ్రోయ్ పేర్లను ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

